జర్నలిస్టుల ఆరోగ్యంపై బాబు కలవరం… సూచనలు

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న మీడియా ప్రతినిధుల ఆరోగ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో 53 మంది, చెన్నైలో పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు తన సోషల్ మీడియా మాధ్యమంగా పలు సూచనలు అందజేశారు. మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో… ‘ప్రియమైన మీడియా ప్రతినిధుల్లారా.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధిలాంటివారు. కరోనా […]

Update: 2020-04-22 04:24 GMT

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న మీడియా ప్రతినిధుల ఆరోగ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో 53 మంది, చెన్నైలో పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు తన సోషల్ మీడియా మాధ్యమంగా పలు సూచనలు అందజేశారు. మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో…

‘ప్రియమైన మీడియా ప్రతినిధుల్లారా.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధిలాంటివారు. కరోనా నేపథ్యంలో మీతో పాటు మీ కుటుంబం పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. చాలా మంది జర్నలిస్టులకు కొవిడ్‌-19 సోకడం ఆందోళన కలిగిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

‘యునిసెఫ్‌ మార్గదర్శకాలను అనుసరించి కరోనా విజృంభణ నేపథ్యంలో ఏమేం చేయాలో, ఏమేం చేయొద్దనే విషయాలపై నేను సూచనలు చేస్తున్నాను. దయచేసి ఈ జాగ్రత్తలను మీ సెల్‌ఫోన్లలో సేవ్‌ చేసుకోండి. పూర్తి జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కరోనా విజృంభణను ఎదుర్కోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పండి’ అని పోస్ట్ చేశారు.

Tags: chandrababu naidu, tdp, twitter, media staff, corona virus

Tags:    

Similar News