ప్రతి గల్లీకి వెళ్లి సేకరించాలి
దిశ, భువనగిరి: రోజూ ప్రతి వీధిలోని గల్లిగల్లీకి తిరిగి చెత్తను సేకరించాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ యెన్నం ఆంజనేయులు అన్నారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలో వివిధ శానిటేషన్ జోన్లలో తిరిగి, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి వార్డులో ప్రజలు చెత్త తీసుకొని వచ్చేంతవరకూ వేచి చూడాలని ఆదేశించారు. నూతనంగా వచ్చిన ఆటోలకు తడి, పొడి చెత్తను వేరుచేసి అందించి స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని కోరారు. పట్టణంలోని రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారులు, […]
దిశ, భువనగిరి: రోజూ ప్రతి వీధిలోని గల్లిగల్లీకి తిరిగి చెత్తను సేకరించాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ యెన్నం ఆంజనేయులు అన్నారు. ఆదివారం తెల్లవారుజామున పట్టణంలో వివిధ శానిటేషన్ జోన్లలో తిరిగి, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి వార్డులో ప్రజలు చెత్త తీసుకొని వచ్చేంతవరకూ వేచి చూడాలని ఆదేశించారు. నూతనంగా వచ్చిన ఆటోలకు తడి, పొడి చెత్తను వేరుచేసి అందించి స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
పట్టణంలోని రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారులు, తమ షాపులు మూసివేసిన అనంతరం చెత్తను ఒక బ్యాగ్‌లో వేసి ఉంచాలన్నారు. రోడ్లమీద విచ్చలవిడిగా వేయడం వలన గాలికి కొట్టుకుపోయి పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందికలగటమే కాకుండా అపరిశుభ్రం అవుతుందని అన్నారు. సిబ్బంది చేతులకు తొడుగులు, ముఖానికి మాస్కు ధరించి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.