ఉత్తమ వెబ్ సిరీస్‌గా శ్రీకాంత్ ‘చదరంగం’
దిశ, ఫీచర్స్: 2020 ఫిబ్రవరిలో జీ5 వేదికగా విడుదలైన ‘చదరంగం’ భారతీయ ఉత్తమ వెబ్ సిరీస్ (ప్రాంతీయ) అవార్డు సొంతం చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను.. వీడియో, ఆడియో క్వాలిటీ ఆధారంగా ఎంపిక చేశారు. స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021, ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా గ్రూప్ కలిసి ఈ అవార్డును ప్రకటించాయి. రాజకీయ నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా వచ్చిన ఈ సరీస్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఈ సిరీస్‌ని 24 […]
దిశ, ఫీచర్స్: 2020 ఫిబ్రవరిలో జీ5 వేదికగా విడుదలైన ‘చదరంగం’ భారతీయ ఉత్తమ వెబ్ సిరీస్ (ప్రాంతీయ) అవార్డు సొంతం చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను.. వీడియో, ఆడియో క్వాలిటీ ఆధారంగా ఎంపిక చేశారు. స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021, ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా గ్రూప్ కలిసి ఈ అవార్డును ప్రకటించాయి. రాజకీయ నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా వచ్చిన ఈ సరీస్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఈ సిరీస్‌ని 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించారు. నిర్మాత విష్ణు మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ నటుడు హీరో శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌తో పాటు చిత్ర బృందం వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ సిరీస్ మా హృదయానికి బాగా దగ్గరైందంటూ.. ఈ వెబ్ సిరీస్ భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ అవార్డు మాకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నమ్మినందుకు జీ 5కి ధన్యవాదాలన్నారు మంచు విష్ణు.