‘ఐసొలేషన్ బెడ్ చార్జీ 24వేలకు బదులు 8వేలు తీసుకోవాలి’

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్-19 పేషెంట్లకు భారం తగ్గించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్యానెల్ సూచించింది. ఢిల్లీలో ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్లకు వైద్య ఖర్చులను తగ్గించాలని తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఐసొలేషన్ బెడ్ చార్జీలను దాదాపు సగానికి తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం ఐసొలేషన్ బెడ్‌(పీపీఈ కిట్ లేకుండానే)కు రూ. 24వేల నుంచి 25వేల వరకు ఉన్నది. ఈ చార్జీలను పీపీఈ […]

Update: 2020-06-19 07:59 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్-19 పేషెంట్లకు భారం తగ్గించే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్యానెల్ సూచించింది. ఢిల్లీలో ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్లకు వైద్య ఖర్చులను తగ్గించాలని తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఐసొలేషన్ బెడ్ చార్జీలను దాదాపు సగానికి తగ్గించాలని పేర్కొంది. ప్రస్తుతం ఐసొలేషన్ బెడ్‌(పీపీఈ కిట్ లేకుండానే)కు రూ. 24వేల నుంచి 25వేల వరకు ఉన్నది. ఈ చార్జీలను పీపీఈ కిట్‌తో సహా రూ. 8వేల నుంచి 10వేలకు కుదించాలని రికమెండ్ చేసింది. అలాగే, ఐసీయూలు వెంటిలేటర్ లేకుండా రూ. 34వేల నుంచి 43వేలకు, వెంటిలేటర్ సదుపాయంతో రూ.44వేల నుంచి 54వేల వరకు ఉన్నది. వీటిని పీపీఈ కిట్‌తోపాటు వెంటిలేటర్ లేకుండా ఐసీయూ చార్జీ రూ.13వేల నుంచి 15వేలకు, వెంటిలేటర్‌తో రూ.15వేల నుంచి 18వేలకు తగ్గించాలని తెలిపింది. కాగా, ఢిల్లీలో కరోనా టెస్టులకు చార్జీలపై ఢిల్లీ ప్రభుత్వం పరిమితి విధించింది. ఇక్కడ కరోనా టెస్టులకు చార్జీలు గరిష్టంగా రూ. 2,400 కంటే ఎక్కువ తీసుకోరాదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Tags:    

Similar News