గుడ్‌న్యూస్: తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడంతో.. దాని ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విమర్శలు ఎదురవుతున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న క్రమంలో పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి మైనస్‌గా మారాయి. ఈ క్రమంలో […]
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడంతో.. దాని ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి విమర్శలు ఎదురవుతున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న క్రమంలో పెట్రోల్ ధరలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి మైనస్‌గా మారాయి.
ఈ క్రమంలో పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాలతో పాటు ఆయిల్ కంపెనీలతో కేంద్ర ఆర్థికశాఖ సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పన్ను తగ్గింపుపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనా సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవడంతో.. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ట్యాక్స్‌లను తగ్గిస్తే ఆటోమేటిక్‌గా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.