కేంద్రం చేతుల్లోకి రాష్ట్రాల అధికారాలు

ప్రకృతి, మానవులు సృష్టించిన విపత్తులను ఎదుర్కోవడానికి వినియోగించే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను దేశంలో మొట్టమొదటిసారి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. వైద్యారోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అధికారం కూడా. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశానికి ముప్పు పొంచి ఉంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఆ బాధ్యతను […]

Update: 2020-03-25 01:27 GMT

ప్రకృతి, మానవులు సృష్టించిన విపత్తులను ఎదుర్కోవడానికి వినియోగించే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను దేశంలో మొట్టమొదటిసారి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాయి. వైద్యారోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అధికారం కూడా. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశానికి ముప్పు పొంచి ఉంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఆ బాధ్యతను నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తుందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను పాటించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీల సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి తెలిపినట్లు సమాచారం.

మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్‌డౌన్.. నిర్బంధ కర్ఫ్యూనా కాదా అనే విషయం సీఎస్‌లు, డీజీపీలు స్పష్టత కోరారు. ఈ విషయంపై కేంద్ర అధికార వర్గాలు వివరణ ఇస్తూ జనం బయట తిరగడం వల్ల మరికొంత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని, కాబట్టి జనాన్ని ఇంటికే పరిమితం చేయడం లాక్‌డౌన్ ముఖ్యోద్దేశమన్నారు. ఇది శాంతిభద్రతల సమస్య కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

Tags: Centre, National Disaster Management Act, Takes Control, Coronavirus Battle In States

Tags:    

Similar News