ఖైరతాబాద్ జోన్‌లో కేంద్ర బృందం పర్యటన
దిశ, న్యూస్‌బ్యూరో: జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం సోమవారం ఖైరతాబాద్ జోన్‌లో పర్యటించింది. అనంతరం హుమాయూన్‌నగర్ కంటైన్మెంట్ జోన్‌ను సందర్శించి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆయా అంశాలపై తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి తెలిపారు. తర్వాత సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేసింది. సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్‌లు, సింగిల్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం సోమవారం ఖైరతాబాద్ జోన్‌లో పర్యటించింది. అనంతరం హుమాయూన్‌నగర్ కంటైన్మెంట్ జోన్‌ను సందర్శించి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆయా అంశాలపై తీసుకున్న చర్యలను కేంద్ర బృందానికి తెలిపారు. తర్వాత సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేసింది. సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్‌లు, సింగిల్ యూజ్ బెడ్‌షీట్లు, టవల్స్, మాస్కులు, అత్యవసర మందుల నాణ్యతను పరిశీలించారు. జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ ఆస్పత్రులకు ఇండెంట్ ప్రకారం మందులను ప్రత్యేక వాహనాల ద్వారా పంపిస్తున్నట్లు అధికారులు వివరించారు. బృందంలో ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, ప్రావిణ్య ఉన్నారు.
tags: Lockdown, GHMC, central team, Hyderabad