వారు ఎందుకు మౌనంగా ఉన్నారు?
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత ఇమర్తి దేవిని ఐటమ్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. మహిళలపై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా గాంధీ కుటుంబం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ నేతపై కమల్ నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అయితే ఇంత జరుగుతున్నా గాంధీ కుటుంబం […]
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత ఇమర్తి దేవిని ఐటమ్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. మహిళలపై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా గాంధీ కుటుంబం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ నేతపై కమల్ నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అయితే ఇంత జరుగుతున్నా గాంధీ కుటుంబం స్పందించడం లేదని అన్నారు.
”మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఇలా వ్యాఖ్యానించడం ఇదేమి తొలిసారి కాదని ఆమె అన్నారు. గతంలో ఓ మహిళా కార్యకర్త పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఎవరు మర్చిపోతారు? అని ఆమె చెప్పారు. ఇప్పుడు కమల్‌నాథ్ కూడా అలాగే వ్యవహరించారని ఆమె అన్నారు. మహిళలపై గాంధీ కుంటుంబానికి ఏమాత్రం గౌరవమున్నా కమల్‌నాథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. అయితే ఇది జరగక పోవచ్చని ఆమె తెలిపారు. ఎందుకంటే ఇలాంటి వాళ్లంతా కాంగ్రెస్ నుంచే పుట్టుకొస్తారని అని ఆమె అన్నారు.