ప్రధానిపై రాహుల్‌కు అంత ద్వేషమా : రాంమాధవ్
దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. లఢక్ విషయంలో ప్రధాని దేశప్రజలను మోసం చేస్తున్నారని, చైనాకు మన భూభాగాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. వాటిని బీజేసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, రాహుల్‌పై మండిపడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి కార్యక్రమం బీహార్‌లో జరిగింది. దానికి హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. ప్రధాని […]
దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. లఢక్ విషయంలో ప్రధాని దేశప్రజలను మోసం చేస్తున్నారని, చైనాకు మన భూభాగాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. వాటిని బీజేసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, రాహుల్‌పై మండిపడ్డారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి కార్యక్రమం బీహార్‌లో జరిగింది. దానికి హాజరైన రాంమాధవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎర్రకోట సాక్షిగా లఢఖ్ అమరవీరుల గురించి మాట్లాడారని, మన సైనికుల త్యాగాలను ప్రశంసించారని గుర్తుచేశారు. ఆ మాటలు విన్న ఓ వ్యక్తి ప్రధానిపై విమర్శలు చేస్తున్నారంటే.. అతనికి ‘ఎన్ని డిగ్రీల తీవ్రత.. ఎంత ద్వేశం ఉందో’ దేశం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.
అంతకుముందు రాహుల్ పీఎం మోదీపై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనపై ప్రధాని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. భారత భూబాగాన్ని పొందడానికి చైనాకు అవకాశం ఇచ్చారన్నారు. భారత సైన్యం శక్తి, సామర్థ్యాలపై మోదీకి తప్పా, దేశంలో ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందన్నారు. ఆయన పిరికితనం వల్ల మన భూభాగాన్ని కొట్టేయడానికి చైనాకు అవకాశం లభించిందన్నారు.