సీఎం యడియూరప్ప రాజీనామా .. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాల్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, ముర్గేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మై పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం భేటీ కానుంది. మీటింగ్ అనంతరం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఓ స్పష్టత రానుంది. సీఎం పదవికి […]

Update: 2021-07-27 03:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాల్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, ముర్గేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మై పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం భేటీ కానుంది. మీటింగ్ అనంతరం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఓ స్పష్టత రానుంది.

సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్‌లకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కన్నడ తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక పరిశీలకులుగా కిషన్ రెడ్డి, ధర్మేంధ్ర ప్రధాన్‌లను నియమించింది. సాయంత్రం శాసనసభాపక్ష సమావేశం అనంతరం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని పరిశీలకులు ప్రకటించనున్నారు.

Tags:    

Similar News