మోడీ విప్లవాత్మక మార్పు తెచ్చారు : కిషన్‌ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ 70 ఏళ్లలో ఎన్నడూ లేని విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు దళారీ వ్యవస్థను తొలగించే చర్యలు చేపట్టారన్నారు. ఆత్మనిర్బర్ భారత్ పేరిట రాష్ట్రాలకు కేంద్రం సాయం చేసిందని, అయినా వారు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని గుర్తుచేశారు. అలాగే, జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్త రైతు చట్టంపై ప్రతిపక్షాలు […]

Update: 2020-10-05 02:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ 70 ఏళ్లలో ఎన్నడూ లేని విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు దళారీ వ్యవస్థను తొలగించే చర్యలు చేపట్టారన్నారు. ఆత్మనిర్బర్ భారత్ పేరిట రాష్ట్రాలకు కేంద్రం సాయం చేసిందని, అయినా వారు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని గుర్తుచేశారు.

అలాగే, జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్త రైతు చట్టంపై ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎడ్యూకేషన్ పాలసీని కేంద్రం ప్రభుత్వం సంస్కరించిందని ఆయన స్పష్టంచేశారు.

Tags:    

Similar News