నేను నాగలి కడతా.. నువ్వు కడతావా? సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. 2022లో 860 కిలో మీటర్లు, 22వేలకు పైగా కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. తెలంగాణ ముఖచిత్రం జాతీయరహదారులతో మారిందన్నారు. పార్లమెంట్ సమావేశాల తరువాత తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని, కొన్ని రోడ్లు ప్రారంభించి మరికొన్ని రోడ్లకు శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున భూసేకరణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. 2022లో 860 కిలో మీటర్లు, 22వేలకు పైగా కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. తెలంగాణ ముఖచిత్రం జాతీయరహదారులతో మారిందన్నారు. పార్లమెంట్ సమావేశాల తరువాత తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని, కొన్ని రోడ్లు ప్రారంభించి మరికొన్ని రోడ్లకు శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, హింస, ఘర్షణలు జరిగే విదంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. ‘నేను కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా..నేను నాగలి కడుతా.. కేసీఆర్ ను నాగలి కట్టమని చెప్పండి. ఎవరికి వ్యవసాయం తెలుసో అర్థం అవుతుంది’ అని కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.