‘కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించండి’
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాకకు అన్యాయం చేసిన గులాబి పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో దుబ్బాక ప్రజల గొంతును వినిపించేవారినే గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పడింది కేవలం ఒక్క కుటుంబం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణను తెచ్చుకున్నది ప్రజల కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా అని కిషన్ ప్రశ్నించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాకకు అన్యాయం చేసిన గులాబి పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో దుబ్బాక ప్రజల గొంతును వినిపించేవారినే గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పడింది కేవలం ఒక్క కుటుంబం కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణను తెచ్చుకున్నది ప్రజల కోసమా, కేసీఆర్ కుటుంబం కోసమా అని కిషన్ ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి జరగకపోయిన అప్పులు మాత్రం పెరిగాయన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.