వారందరికీ కరోనా టెస్టులు చేయండి : కేంద్రం

దిశ, వెబ్ డెస్క్: దేశంలో వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పట్టణాల నుంచి కరోనా గ్రామాలకు పాకడంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది.తాజాగా కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే ఊరూరా తిరిగి కూరగాయలు అమ్మేవారు, వ్యాపారులు, అలాగే మార్కెట్లలో కూరగాయలు అమ్మేవారు, దుకాణాదారులు మొదలగు చిరు వ్యాపారులందరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ […]

Update: 2020-08-08 09:52 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పట్టణాల నుంచి కరోనా గ్రామాలకు పాకడంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్రం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది.తాజాగా కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే ఊరూరా తిరిగి కూరగాయలు అమ్మేవారు, వ్యాపారులు, అలాగే మార్కెట్లలో కూరగాయలు అమ్మేవారు, దుకాణాదారులు మొదలగు చిరు వ్యాపారులందరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఆక్సిజన్ సదుపాయంతో కూడిన అంబులెన్స్‌లు, సత్వరం స్పందించే యంత్రాంగం కూడా అందుకు రెడీగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అంబులెన్స్‌ లేవనే కారణంగా తిరస్కరించే కేసులు రోజుకు ఒక్కటి కూడా లేకుండా చూడాలని, ఈ వ్యవహామంతా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టంచేశారు.

కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కేసులను ఎంత ఎర్లీగా గుర్తిస్తే, అంత త్వరగా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అలాగే, ఇన్ఫెక్షన్‌కు గురైన వారి పరిస్థితి విషమించకుండా జాగ్రత్త పడొచ్చాన్నారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సిబ్బందిని, పరికరాలన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News