జమ్మూకశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370, 35Aను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జమ్మూకశ్మీర్ విషయంపై కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో ఉన్న వంద కంపెనీలకు చెందిన 10వేల మంది భద్రతా బలగాలను వెనక్కి రప్పించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో CRPF, BSF,CISF, SSBలకు చెందిన సిబ్బంది ఇన్ని రోజులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ముందు […]

Update: 2020-08-19 09:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370, 35Aను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, జమ్మూకశ్మీర్ విషయంపై కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో ఉన్న వంద కంపెనీలకు చెందిన 10వేల మంది భద్రతా బలగాలను వెనక్కి రప్పించనున్నట్లు బుధవారం ప్రకటించింది.

ఇందులో CRPF, BSF,CISF, SSBలకు చెందిన సిబ్బంది ఇన్ని రోజులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం ఈ బలగాలను జమ్మూకశ్మీర్‌కు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త సర్దుమణగడంతో వీరిందరినీ వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News