ట్రాక్టర్ ర్యాలీపై వ్యాజ్యం ఉపసంహరణ
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవడం లేదా అనుమతించడం తమ పని కాదని, అది ఢిల్లీ పోలీసుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ, ట్రాక్టర్ ర్యాలీపై తాము ఎటువంటి ఆదేశాలనూ జారీ చేయబోమని, అది పోలీసులకు సంబంధించిన […]
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవడం లేదా అనుమతించడం తమ పని కాదని, అది ఢిల్లీ పోలీసుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ, ట్రాక్టర్ ర్యాలీపై తాము ఎటువంటి ఆదేశాలనూ జారీ చేయబోమని, అది పోలీసులకు సంబంధించిన అంశమని పునరుద్ఘాటించింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తున్నామని, రైతుల ట్రాక్టర్ మార్చ్‌పై ఆదేశాలు జారీ చేయడానికి కేంద్రానికి అధికారాలున్నాయని పేర్కొంది. అనంతరం, ఆ వ్యాజ్యాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది.