తెలంగాణపై కేంద్రం ప్రశంసలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రామ పంచాయతీల పనితీరును పరిశీలించిన కేంద్రం… ఆన్‌లైన్ ఆడిట్ విధానంపై ప్రశంసలు కురిపించింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం.. 25శాతం గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ మాదిరిగా సమన్వయం చేసుకోవాలని కేంద్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ కేఎస్ సేథి అన్నారు. తెలంగాణలో మరో 25శాతం గ్రామ పంచాయతీలను ఆడిట్ చేయాలని కోరారు. అన్నిరకాలుగా ఆన్‌లైన్ ఆడిట్‌లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇతర రాష్ట్రాలు […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రామ పంచాయతీల పనితీరును పరిశీలించిన కేంద్రం… ఆన్‌లైన్ ఆడిట్ విధానంపై ప్రశంసలు కురిపించింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం.. 25శాతం గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ మాదిరిగా సమన్వయం చేసుకోవాలని కేంద్ర పంచాయతీ రాజ్ సెక్రటరీ కేఎస్ సేథి అన్నారు. తెలంగాణలో మరో 25శాతం గ్రామ పంచాయతీలను ఆడిట్ చేయాలని కోరారు. అన్నిరకాలుగా ఆన్‌లైన్ ఆడిట్‌లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇతర రాష్ట్రాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయన్నారు.