దేశంలో బర్డ్‌ఫ్లూ నిజమే.!

న్యూఢిల్లీ: దేశంలో బర్డ్‌ఫ్లూ కేసుల నమోదును కేంద్ర ప్రభుత్వం ధ‌ృవీకరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఆయా రాష్ట్రాల నుంచి పంపిన నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ (ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్ఏడీ) పరిశీలించి బర్డ్ ఫ్లూ సోకడంతోనే పక్షులు మృతిచెందినట్లు స్పష్టం చేసింది. రాజస్తాన్ రాష్ట్రం జలాల్‌వర్, కోటా జిల్లాలోని బరాన్‌, […]

Update: 2021-01-06 08:21 GMT

న్యూఢిల్లీ: దేశంలో బర్డ్‌ఫ్లూ కేసుల నమోదును కేంద్ర ప్రభుత్వం ధ‌ృవీకరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఆయా రాష్ట్రాల నుంచి పంపిన నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసిజెస్ (ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్ఏడీ) పరిశీలించి బర్డ్ ఫ్లూ సోకడంతోనే పక్షులు మృతిచెందినట్లు స్పష్టం చేసింది.

రాజస్తాన్ రాష్ట్రం జలాల్‌వర్, కోటా జిల్లాలోని బరాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రం మండసోర్, ఇండోర్, మాల్వా జిల్లాల్లో కాకులు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రాలో వలస పక్షులు, కేరళ రాష్ట్రంలో కొట్టాయం, అల్లపూజలో పౌల్ట్రీ బాతులు బర్డ్ ఫ్లూ సోకడంతో మృతి చెందాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి సమాచారం అందగానే బర్డ్ ఫ్లూపై నేషనల్ యాక్షన్ ప్లాన్ మార్గదర్శకాల ప్రకారం నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించాం. ఈ నెల 5న హిమాచల్ ప్రదేశ్‌‌కు కూడా బర్డ్ ప్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరాం. అప్పటికే కేరళ రాష్ట్రం వైరస్ నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టింది. బర్డ్ ఫ్లూ బయటపడిన ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి విస్తరించకుండా పక్షుల సంహారానికి చర్యలు తీసుకున్నారు అని మంత్రిత్వశాఖ తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం న్యూఢిల్లీ‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వాలకు నివారణ, నియంత్రణ చర్యలపై ప్రతిరోజు మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News