ఆ పార్టీనే గెలిపించాలి..

దిశ, సిద్దిపేట: వ్యవసాయ రంగంలో పంటల భీమా పథకం అమల్లో గత కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనీ తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు కుటుంబాల బిడ్డల పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు, వైద్యానికి షూరిటీ లేకుండా పదిహేను లక్షల రూపాయలు అప్పులు ఇప్పించడంలో గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వృద్ధ రైతులకు నెలకు పదివేల రూపాయలు […]

Update: 2020-10-12 08:49 GMT

దిశ, సిద్దిపేట: వ్యవసాయ రంగంలో పంటల భీమా పథకం అమల్లో గత కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనీ తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు కుటుంబాల బిడ్డల పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు, వైద్యానికి షూరిటీ లేకుండా పదిహేను లక్షల రూపాయలు అప్పులు ఇప్పించడంలో గత, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. వృద్ధ రైతులకు నెలకు పదివేల రూపాయలు పింఛన్ అమలు చేయాలని గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తుంటే కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వెంటనే వృద్ధ రైతులకు పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ రంగంలోని అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న పార్టీ ఏదో ఆలోచించి ఆ పార్టీని రైతులు, కార్మికులు గెలిపించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News