స్థానిక సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్
దిశ, వెబ్డెస్క్: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్ధానిక సంస్థలకు ఇవాళ రూ. 8,923 కోట్లు విడుదల చేసింది. గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిలకు ఈ నిధులు విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం ఈ నిధులు ఉపయోగించుకోవాలని తెలిపింది. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జూన్లో ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఒక నెల ముందుగానే విడుదల చేస్తున్నట్లు […]
దిశ, వెబ్డెస్క్: స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 25 రాష్ట్రాల్లోని గ్రామీణ స్ధానిక సంస్థలకు ఇవాళ రూ. 8,923 కోట్లు విడుదల చేసింది. గ్రామం, బ్లాక్, జిల్లా స్థాయిలకు ఈ నిధులు విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం ఈ నిధులు ఉపయోగించుకోవాలని తెలిపింది.
అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జూన్లో ఈ నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఒక నెల ముందుగానే విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.