పుల్ల ఉంటే చాలు.. ఓటేయొచ్చు

దిశ, వెబ్‌డెస్క్: పుల్ల ఉంటే చాలు ఓటేయొచ్చు.. అవును మీరు విన్నది నిజమే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. బీహార్ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఇటీవల 65 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, శనివారం ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసే క్రమంలో ఈవీఎం బటన్ నొక్కేందుకు చేతి వేళ్లతో కాకుండా.. చెక్క పుల్లలను ఉపయోగించాలని సూచించింది. మరో […]

Update: 2020-07-04 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుల్ల ఉంటే చాలు ఓటేయొచ్చు.. అవును మీరు విన్నది నిజమే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. బీహార్ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఇటీవల 65 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, శనివారం ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసే క్రమంలో ఈవీఎం బటన్ నొక్కేందుకు చేతి వేళ్లతో కాకుండా.. చెక్క పుల్లలను ఉపయోగించాలని సూచించింది. మరో మూడు నాలుగు నెలల్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేసేందుకు ఈసీ ప్లాన్ చేస్తోంది. అలాగే, పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఓట్లు వేసేలా.. 45 శాతం కేంద్రాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఓటర్లకు కరోనా దృష్ట్యా శానిటైజర్లను కూడా అందజేసేందుకు ఈసీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News