ఎమ్మెల్సీ ఉప‌ఎన్నిక షెడ్యూల్ విడుదల..

దిశ, న్యూస్ బ్యూరో : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు గురువారం జాతీయ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటి చేసి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి కాంగ్రెస్ చేరాడు. గులాబీ నాయకుల ఫిర్యాదు మేరకు పార్టీ ఫిరాయింపు చట్టం కింద శాసనమండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ విధంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జాతీయ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని […]

Update: 2020-03-05 09:03 GMT

దిశ, న్యూస్ బ్యూరో :
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు గురువారం జాతీయ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటి చేసి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి కాంగ్రెస్ చేరాడు. గులాబీ నాయకుల ఫిర్యాదు మేరకు పార్టీ ఫిరాయింపు చట్టం కింద శాసనమండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ విధంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జాతీయ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి12న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 19న నామినేషన్‌ వేసేందుకు చివరిరోజుగా నిర్ణయించారు. 20న నామినేషన్ల పరిశీలన, 23 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా తేల్చారు. ఏప్రిల్ 7న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుండగా, 9న కౌంటింగ్ ఉండనుంది.

tags ; mlc shedule release, central election commision, election date

Tags:    

Similar News