తెలంగాణ పర్యాటకానికి కేంద్రం ప్రశంస

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టూరిజం రంగం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం ప్రశంసనీయమన్నారు. పలు పర్యాటక ప్రాజెక్టులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అభినందించారు. పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం […]

Update: 2020-12-21 12:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన కేంద్ర టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ మీనాక్షి శర్మ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టూరిజం రంగం అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం ప్రశంసనీయమన్నారు. పలు పర్యాటక ప్రాజెక్టులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అభినందించారు. పర్యాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పలు ప్రతిపాదనలను మంత్రి శ్రీనివాసగౌడ్ ఆమెకు అందజేశారు. వీటిని తప్పకుండా పరిశీలిస్తానని, మంత్రిత్వశాఖ అధికారులతో చర్చించి తగిన సహకారం అందిస్తామన్నారు.

తెలంగాణ టూరిజం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో టూరిస్టు సర్క్యూట్‌ల ప్రతిపాదనలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆమెకు మంత్రి విజ్ఞప్తి చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రణాళికతో పాటు అనుబంధంగా పర్యాటకాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఏకో టూరిజం సర్క్యూట్‌లో భాగంగా స్వదేశీ దర్శన్ పథకం కింద నిర్మించిన ఫర్హాబాద్, మన్ననూరు, ఉమామహేశ్వరం, ఈగలపెంట దగ్గరి టూరిజం ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు.

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో టూరిజం శాఖకు చెందిన క్రూయిజ్‌లను, బోట్‌లను పరిశీలించారు. అలంపూర్ శక్తిపీఠం జోగులంబ దేవాలయం, హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ సమాధులు తదితరాలను పరిశీలించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News