జల వివాదాలను నాన్చుతున్నది కేంద్రమే !
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాల అంశంలో కేంద్రానిదే తప్పు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ సర్కారుదేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జల వివాదం అనేది రాష్ట్రాల పరిధిలో తేలే అంశం కాదని, రాష్ట్రం ఆవిర్భవించిన 6 వారాల్లోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని 2014 జూలై 14న రాష్ట్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాల అంశంలో కేంద్రానిదే తప్పు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ సర్కారుదేనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జల వివాదం అనేది రాష్ట్రాల పరిధిలో తేలే అంశం కాదని, రాష్ట్రం ఆవిర్భవించిన 6 వారాల్లోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని 2014 జూలై 14న రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారని, అదే రోజు రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి నోటీస్ ఇచ్చారని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేకుండా పరిష్కారం చూపాలని గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ కోరుతున్నారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు కేంద్ర జల వనరుల శాఖ మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీకి లేఖలు రాశారని వివరించారు.