కరోనా కొత్త రూపం.. వ్యాప్తి వేగం?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తూ కొనసాగుతోంది. ఇప్పుడది తన పయనంలో మరింత ప్రాణాంతక మార్పులను సంతరించుకుంటోంది. ఈ కొత్త జన్యు ఉత్పరివర్తనం వ్యాక్సిన్ తయారీ మీద, సామర్ధ్యం మీదా అనుమానాలు కలిగిస్తోంది. అయితే, ఇది పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదంటూ ఇటీవల సెల్ ప్రెస్ పత్రిక ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. టాప్ ఇమ్యునాలజిస్టులు మాత్రం దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కొత్త జన్యువు వేగంగా […]

Update: 2020-08-19 21:08 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తూ కొనసాగుతోంది. ఇప్పుడది తన పయనంలో మరింత ప్రాణాంతక మార్పులను సంతరించుకుంటోంది. ఈ కొత్త జన్యు ఉత్పరివర్తనం వ్యాక్సిన్ తయారీ మీద, సామర్ధ్యం మీదా అనుమానాలు కలిగిస్తోంది.

అయితే, ఇది పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదంటూ ఇటీవల సెల్ ప్రెస్ పత్రిక ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. టాప్ ఇమ్యునాలజిస్టులు మాత్రం దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కొత్త జన్యువు వేగంగా వ్యాప్తి చెందుతోందని, తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు, ఫార్మకాలజిస్టు డా.ఆకుల సంజయ్ రెడ్డి చెబుతున్నారు.

SARS-CoV-2 లోని D614G మ్యూటేషన్ ను మరోసారి ప్రపంచమంతా ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. అనేకానేక పరివర్తనాలతో ‘సార్స్‌ కోవ్‌ 2’ వైరస్‌ జన్యు క్రమంలో మార్పు జరిగిందని తెలిపారు. దీంతో డి614జి అనే కొత్త రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్ల డించారని అంటున్నారు. ఈ కొత్త జన్యువు వలన వైరస్ కు మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం పెరిగిందంటున్నారు. పరిశోధనల్లో ఈ వైరస్‌కి సంక్రమణ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వివరించారు.

ఏప్రిల్ లోనే గుర్తింపు

D614G వైరస్‌ ను ఏప్రిల్‌ మొదటి వారంలో గుర్తించారు. స్థానిక కరోనా వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో D614G రంగ ప్రవేశంతో పరిస్థితి తారుమారు అవుతోందని డా.సంజయ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడున్న వైరస్‌ రకాల్లో D614G ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందని బెటె కోర్బర్ అనే శాస్త్రవేత్త వెల్లడించినట్లు చెప్పారు.

శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఈ వైరస్‌ భారీ స్థాయిలో ఉంటుందని, అందుకే ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మలేషియా సైంటిస్టులు ప్రస్తుతం ఉన్న కరోనా కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో వ్యా పించే మరో కొత్త రకం వైరస్ ను గుర్తించారని వెల్లడించారు. అది D614G కరోనా కన్నా 10 రెట్లు ప్రమాదకరమైనప్పటికీ, కొన్ని రోజుల వరకే ఈ బతికి ఉంటుందని తెలుస్తోందన్నారు.

ఆ తర్వా త ఇది బలహీనపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆలోపు ఎంతమంది ఈ వైరస్ బారిన పడతారో అని భయాందోళన వ్యక్తమవుతోందన్నారు. ఈ వైరస్ ను మొద టగా భారత్ నుంచి మలేషియాకు తిరిగి వెళ్లిన ఓ వ్యక్తిలో గుర్తించారన్నారు.

అమెరికా, ఐరోపా దేశాల్లోనూ విస్తరించిందంటున్నారు. మలేషియా కరోనా కట్టడిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అయినప్పటికీ దేశంలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ పై కొనసాగుతున్న ప్రయోగాలు, అధ్యయనాల మీద దీని ప్రభావం ఉంటుందని మలేషియా హెల్త్ జనరల్ డైరెక్టర్ నూర్ హిషాం అబ్దుల్లా చెప్పారని వివరించారు.

ఇది పెను సవాలే..

‘కరోనా’ ప్రొటీన్‌ మార్పులతో ఈ వైరస్‌ కొత్తరూపాన్ని ధరించిందని, అమెరికాలోని లాన్‌ ఆల్మోస్‌ నేషనల్‌ లేబోరేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు. D614G వైరస్‌ మ్యూటేషన్‌ చెందుతూ తన జన్యు క్రమాన్ని మార్చుకోవడం జౌషధాలు, వ్యాక్సిన్‌ తయారీకి పెను సవాలుగా మారుతుందన్నారు.

వైరస్‌ ఉత్పరివర్తనంపై మరింత పరిశోధన అవసరమని, ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం కాబోదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ శేషాద్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News