బిపిన్ రావత్ దంపతులకు వారి కుమార్తెలు, ప్రముఖుల నివాళులు..
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వీరి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి. ప్రజల సందర్శనార్థం బిపిన్ రావత్, మధులిక రావత్‌ల భౌతిక దేహాలనుశుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 3 కామరాజ్ మార్గ్‌లోని రావత్ నివాసం వద్ద ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు సైనిక సిబ్బంది నివాళులర్పిస్తారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వీరి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి.
ప్రజల సందర్శనార్థం బిపిన్ రావత్, మధులిక రావత్‌ల భౌతిక దేహాలనుశుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 3 కామరాజ్ మార్గ్‌లోని రావత్ నివాసం వద్ద ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు సైనిక సిబ్బంది నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్ రావత్ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా వీరికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రావత్ కుమార్తెలు కృతిక, తరణి నివాళులు అర్పించారు. తల్లిదండ్రుల భౌతికకాయాలపై పూల రేకులు జల్లి అంతిమ వీడ్కోలు పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ఇద్దరి భౌతికకాయాలకు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌గవర్నర్ అనిల్ బైజల్ సహా పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు.
Delhi: Daughters of #CDSGeneralBipinRawat and Madhulika Rawat – Kritika and Tarini – pay their last respects to their parents. pic.twitter.com/7ReSQcYTx7
— ANI (@ANI) December 10, 2021
Home Minister Amit Shah pays tribute to CDS Gen Bipin Rawat who passed away in an IAF chopper crash near Coonoor in Tamil Nadu on Wednesday. pic.twitter.com/Jf14uoUyMe
— ANI (@ANI) December 10, 2021
Congress leader Rahul Gandhi pays tributes to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat who lost their lives in the IAF chopper crash on Wednesday pic.twitter.com/ZjloO9gPgm
— ANI (@ANI) December 10, 2021