CBSE Exams: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు: సోమవారానికి విచారణ వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత నేపథ్యంలో 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లాయర్ మమతా శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా […]

Update: 2021-05-28 02:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత నేపథ్యంలో 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లాయర్ మమతా శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది.

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. జులై 15 నుంచి ఆగస్టు 28వరకు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం చూస్తోంది. ఈ క్రమంలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News