అభిషేక్ బెనర్జీకి సీబీఐ షాక్…

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రుజిరా బందోపాధ్యాయ్ భార్యకు కోల్ స్మగ్లింగ్ కేసులో సీబీఐ ఆదివారం సమన్లు పంపింది. ఈ కేసులో సీబీఐ బృందం తొలిసారిగా కాళిఘాట్‌లోని మమతా బెనర్జీ మేనల్లుడి నివాసానికి వెళ్లింది. సమన్లతోపాటు ఆదివారమే ఆమెను విచారించాలనే ఉద్దేశంతో టీం బయల్దేరింది. కానీ, రుజిరా బందోపాధ్యాయ్ లేకపోవడంతో సమన్లు అప్పజెప్పి 15 నిమిషాల తర్వాత వెనుదిరిగింది. ఆదివారమే రుజిరాను ఆమె బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించాలని సీబీఐ భావించింది. రుజిరా అందుబాటులో […]

Update: 2021-02-21 09:25 GMT

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రుజిరా బందోపాధ్యాయ్ భార్యకు కోల్ స్మగ్లింగ్ కేసులో సీబీఐ ఆదివారం సమన్లు పంపింది. ఈ కేసులో సీబీఐ బృందం తొలిసారిగా కాళిఘాట్‌లోని మమతా బెనర్జీ మేనల్లుడి నివాసానికి వెళ్లింది. సమన్లతోపాటు ఆదివారమే ఆమెను విచారించాలనే ఉద్దేశంతో టీం బయల్దేరింది. కానీ, రుజిరా బందోపాధ్యాయ్ లేకపోవడంతో సమన్లు అప్పజెప్పి 15 నిమిషాల తర్వాత వెనుదిరిగింది. ఆదివారమే రుజిరాను ఆమె బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించాలని సీబీఐ భావించింది.

రుజిరా అందుబాటులో లేకపోవడంతో సీబీఐ అధికారుల కాంటాక్టు నెంబర్ అందించి వెళ్లినట్టు సమాచారం. ఈ సమన్లపై అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ ఈ తరహా బెదిరింపులకు లొంగిపోతామని వారు తప్పుగా భావించారని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ, తాము ఎప్పటికీ భయపడమని ట్వీట్ చేశారు. ఇది రాజకీయ కుట్ర అని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే అమిత్ షా అభిషేక్ బెనర్జీని అవమానించారని, ఈ కేసులో కోర్టు సమన్లు పంపిందని వివరించారు. సరిగ్గా అమిత్ షా కోర్టులో హాజరవ్వడానికి ఒక రోజు ముందు సీబీఐ సమన్లు పంపిందని, ఇది రాజకీయంగా ప్రేరేపిత కుట్ర అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి అన్ని మిత్రపక్షాలు దూరమవ్వడంతో కేవలం సీబీఐ, ఈడీలే మిత్రపక్షాలుగా మారాయని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. ఈ సమన్లు ఊహించినవేనని తెలిపారు.

Tags:    

Similar News