మాజీ హోం మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు..

ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ శుక్రవారం ప్రిలిమిన‌రీ ఎంక్వైరీని పూర్తి చేసింది. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు కేసును సీబీఐకి బాంబే హై కోర్టు గతవారం అప్పగించింది. దీనిపై 15 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి […]

Update: 2021-04-23 23:17 GMT

ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ శుక్రవారం ప్రిలిమిన‌రీ ఎంక్వైరీని పూర్తి చేసింది. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు కేసును సీబీఐకి బాంబే హై కోర్టు గతవారం అప్పగించింది. దీనిపై 15 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని హై‌కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ ప్రిలిమనరీ ఎంక్వైరీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News