వంట మనిషినీ వదలని సీబీఐ
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. వరుసబెట్టి అనుమానిత వ్యక్తుల స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తోంది. గురువారం కూడా వివేకా కుమార్తె సునీతను మరోసారి సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 6.30 గంటలకు వరకు సాగింది. వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మీదేవిని పిలిపించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు సీబీఐ అధికారులు. లక్ష్మీదేవిని విడిగా ఒక్కసారి.. సునీతతో కలిపి మరోసారి విచారించారు అధికారులు. అలాగా […]
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. వరుసబెట్టి అనుమానిత వ్యక్తుల స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తోంది. గురువారం కూడా వివేకా కుమార్తె సునీతను మరోసారి సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 6.30 గంటలకు వరకు సాగింది. వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మీదేవిని పిలిపించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు సీబీఐ అధికారులు. లక్ష్మీదేవిని విడిగా ఒక్కసారి.. సునీతతో కలిపి మరోసారి విచారించారు అధికారులు. అలాగా వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌ను సైతం విచారించారు.