ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేదు. ఏ2 నిందితుడు సెబాస్టియన్ హాజరయ్యాడు. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేదు. ఏ2 నిందితుడు సెబాస్టియన్ హాజరయ్యాడు. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షల ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. 960 పేజీలతో ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
Tags: cash for vote case, acb court, revanth reddy