లాక్‌డౌన్‌లో ఎంతమంది రూల్స్ బ్రేక్ చేశారంటే..

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను నిలువరించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మార్చి 23 నుంచి మే 13వ తేదీ వరకు నగరంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన 2లక్షల 19వేల 684 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా సీసీ టీవీల ద్వారా గుర్తించి 5లక్షల 88వేల 786 వాహనాలపై కేసులు నమోదు చేయగా దాదాపు 73, 130 వాహనాలను […]

Update: 2020-05-14 11:08 GMT

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను నిలువరించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మార్చి 23 నుంచి మే 13వ తేదీ వరకు నగరంలో రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చిన 2లక్షల 19వేల 684 వాహనాలపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా సీసీ టీవీల ద్వారా గుర్తించి 5లక్షల 88వేల 786 వాహనాలపై కేసులు నమోదు చేయగా దాదాపు 73, 130 వాహనాలను సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినందుకు 6 లక్షల 12 వేల 612 మందిపై కేసులు బుక్ చేశారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 41 వేల 144 వారిపై కేసులు నమోదు చేశారు. అపడమిక్ యాక్ట్ రూల్స్‌కు విరుద్దంగా టూ వీలర్ పై డబుల్ రైడింగ్ చేసినందుకు 9,153 కేసులు, త్రిబుల్ రైడింగ్ చేసినందుకు 4,283 మందిపై కేసులను నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News