ధూమపానం.. ఉక్కుపాదం

         నిర్మల్ జిల్లాలో బహిరంగ ధూమపానం చేస్తున్న వారిపై కలెక్టర్ ముషారఫ్ అలీ ఉక్కుపాదం మోపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే కేసులు నమోదు చేసి.. జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే.. అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 400 చొప్పున జరిమానా విధించారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లాలో కలెక్టర్ […]

Update: 2020-02-14 10:14 GMT

నిర్మల్ జిల్లాలో బహిరంగ ధూమపానం చేస్తున్న వారిపై కలెక్టర్ ముషారఫ్ అలీ ఉక్కుపాదం మోపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే కేసులు నమోదు చేసి.. జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే.. అధికారులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 400 చొప్పున జరిమానా విధించారు. ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లాలో కలెక్టర్ ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, రేపటి నుంచి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News