56మందిపై కేసు నమోదు..కారణం ఇదే!

దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు తప్పనిసరి ధరించాలని.. లేనియెడల కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 56 మందిపై కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా కొవిడ్-19 నిబంధనలు పాటించని 15 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు […]

Update: 2020-08-01 10:47 GMT

దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు తప్పనిసరి ధరించాలని.. లేనియెడల కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 56 మందిపై కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా కొవిడ్-19 నిబంధనలు పాటించని 15 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News