ఆర్నబ్ గోస్వామిపై కేసు

ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన టీవీ ఛానళ్లోని ఓ ప్రోగ్రాంలో మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు. గత నెల 14న బాంద్రాలోని ఓ ప్రార్థనాలయం సమీపంలో వలస కార్మికులు నిరసన చేపట్టగా, ఆ నిరసనకూ ప్రార్థనాలయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. మత ఘర్షణలు […]

Update: 2020-05-03 23:05 GMT

ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామిపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన టీవీ ఛానళ్లోని ఓ ప్రోగ్రాంలో మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ నల్ బజార్‌కు చెందిన రాజా ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు. గత నెల 14న బాంద్రాలోని ఓ ప్రార్థనాలయం సమీపంలో వలస కార్మికులు నిరసన చేపట్టగా, ఆ నిరసనకూ ప్రార్థనాలయానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తోందన్న విధంగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, దీనిపై ఆర్నబ్ స్పందించాల్సి ఉంది.

Tags: arnab goswami, journalist, case, mumbai

Tags:    

Similar News