కరోనా లేకున్నా వచ్చిందని.. రూ.లక్షలు డిమాండ్

దిశ, వెబ్ డెస్క్ : మనుషుల భయాన్ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. కరోనా లేకున్నా ఉందని నమ్మించి రూ.లక్షలు డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని హైదరాబాద్ సోమాజిగూడ దక్కన్ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కరోనా లక్షణాలతో వెళ్లిన ఓ వ్యక్తి పట్ల దక్కన్ ఆస్పత్రి వైద్యులు మనీ గేమ్ ఆడారు. అతనికి నెగిటివ్ వచ్చిన […]

Update: 2020-08-02 09:54 GMT

దిశ, వెబ్ డెస్క్ :
మనుషుల భయాన్ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. కరోనా లేకున్నా ఉందని నమ్మించి రూ.లక్షలు డిమాండ్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని హైదరాబాద్ సోమాజిగూడ దక్కన్ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. కరోనా లక్షణాలతో వెళ్లిన ఓ వ్యక్తి పట్ల దక్కన్ ఆస్పత్రి వైద్యులు మనీ గేమ్ ఆడారు. అతనికి నెగిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెట్టి కరోనా రోగుల పక్కన బెడ్ ఇచ్చి చికిత్స అందించారు. తీరా డిశ్చార్చి చేసేందుకు రూ.లక్షలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం స్థానికంగా సంచలనం రేపింది.

Tags:    

Similar News