తప్పుడు సమాచారం పంపిన వ్యక్తిపై కేసు

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కరోనా వ్యాధి సోకిందని వాట్సాప్‎లో తప్పుడు సమాచారం పంపిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దూరు గ్రామానికి చెందిన ఇర్రి రాజిరెడ్డి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపులో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విధంగా పోస్ట్ చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ […]

Update: 2020-03-31 07:56 GMT

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కరోనా వ్యాధి సోకిందని వాట్సాప్‎లో తప్పుడు సమాచారం పంపిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దూరు గ్రామానికి చెందిన ఇర్రి రాజిరెడ్డి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపులో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విధంగా పోస్ట్ చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వచ్చే వదంతులను నమ్మవద్దని తప్పుడు సమాచారం పంపే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: Case, against, person, sent false information, corona, siddipet

Tags:    

Similar News