వృథా అవుతున్న నీరు.. పట్టించుకోని అధికారులు
దిశ,మహబూబ్ నగర్: సాగునీరు వృథా అవుతున్న కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని చిన్న కర్ణంకుంట పెద్ద కర్ణంకుంట నుంచి నీరు వృథా అవుతున్నాయి. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు విమర్శలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి తూము ద్వారా నీరు వృథాగా పోతున్న విషయాన్ని అధికారుల ద్రుష్టికి తీసుకెళ్ళినా.. వారు మాత్రం స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. వెంటనే ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు […]
దిశ,మహబూబ్ నగర్: సాగునీరు వృథా అవుతున్న కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని చిన్న కర్ణంకుంట పెద్ద కర్ణంకుంట నుంచి నీరు వృథా అవుతున్నాయి. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు విమర్శలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి తూము ద్వారా నీరు వృథాగా పోతున్న విషయాన్ని అధికారుల ద్రుష్టికి తీసుకెళ్ళినా.. వారు మాత్రం స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. వెంటనే ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని.. కరోనా సాకుతో అధికారులు తప్పించుకోవడం సరికాదని గ్రామస్తులు అంటున్నారు. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరతున్నారు.
Tags: careless, officials, Wasting water, nagar kurnool