తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితిని పదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏఏ శాఖల్లోThe government has issued orders raising the age limit

Update: 2022-03-20 03:29 GMT

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్న వివరాలను కూడా ప్రభుత్వం వివరించింది. 

*అయితే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ ఉద్యోగాలు, యూనిఫాం సర్వీసులకు తప్ప ఇతర ఉద్యోగాలకు పదేళ్ల పాటు వయోపరిమితిని సడిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

*ప్రస్తుతం రాష్ట్రంలో ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు ఉంది దాన్ని 44 ఏళ్లకు పెంచినట్లు స్పష్టం చేశారు.

*ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకముందు వయో పరిమితి 39 ఏళ్లుగా ఉంది..  ఇప్పుడు 49 ఏళ్లకు పెంచారు.

*దివ్యాంగులకు 44 ఏళ్లు వయోపరిమితి ఉంది.. దాన్ని 54 ఏళ్ల వారు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 

*ఈ జీవోను 2022 మార్చి 19న జారీ చేసినందున సడలింపులు 2024 మార్చి 18వ తేదీ వరకు జరిగే అన్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లకు వర్తించనున్నాయి.


Tags:    

Similar News