TGCAB Recruitment: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ.25 వేల జీతం..!
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(TGCAB) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(TGCAB) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 కోఆపరేటివ్ ఇంటెర్న్స్(Cooperative Interns) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు హైదరాబాద్(HYD)లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ట్రూప్ బజార్ బ్రాంచ్ ఆఫీస్(Troop Bazar Branch Office)లో ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 30 నవంబర్ 2024. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://tscab.org/ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించగలరు.
పోస్టు పేరు, ఖాళీలు:
కోఆపరేటివ్ ఇంటెర్న్స్ - 10
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీఏ(మార్కెటింగ్/అగ్రి బిజినెస్, రూరల్ డెవలప్ మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలో సాధించిన మార్కులు, షార్ట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 జీతం ఉంటుంది.