నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ Specialist Officer Jobs in Punjab National Bank
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 145
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మే 7
*పరీక్ష తేది: 2022 జూన్ 12
*ఇందులో స్పెషలిస్ట్ ఆపీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*మేనేజర్ (రిస్క్) పోస్టులు 40, మేనేజర్ (క్రెడిట్) పోస్టులు 100, సీనియర్ మేనేజర్ (ట్రెజరీ) పోస్టులు 5 వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సీఏ/సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాస్ తో ఏంబీఏ(ఫైనాన్స్)/ పీజీ డిగ్రీ పాసై ఉండాలి.
*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 37 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఆన్ లైన్ రాత పరీక్ష 220 మార్కులకు కేటాయిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు నిర్వహిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.pnbindia.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.