పరీక్ష లేకుండానే ఎస్బీఐలో ఉద్యోగం.. ఈ అర్హతలుంటే చాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ క్యాడర్...Sector Credit Specialist Vacancies in SBI
దిశ, కెరీర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్.. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్ - 16 పోస్టులు
అర్హత: సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), మాస్టర్ డిగ్రీ (ఫైనాన్స్ కంట్రోల్), మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, పీజీడీఎం (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వయసు: అక్టోబర్ 1, 2022 నాటికి 25 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 63840 నుంచి రూ. 89,890.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 29, 2022.
వెబ్సైట్: https://www.sbi.co.in