ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్
ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుభవార్తను తెలిపింది. వివిధ ప్రోగ్రామ్‌లలో మొత్తం 3,500 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ ను IAF విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుభవార్తను తెలిపింది. వివిధ ప్రోగ్రామ్‌లలో మొత్తం 3,500 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ ను IAF విడుదల చేసింది. ఆసక్తి ఉండి.. అర్హత గల అభ్యర్థులు IAF అధికారిక వెబ్‌సైట్, agnipathvayu.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపంది. కాగా దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్‌మెంట్ (01/2024) నోటిఫికేషన్, పరీక్ష తేదీలు, అర్హత ప్రమాణాలు, అర్హతలు, వయోపరిమితి, జీతం, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు రుసుము వంటి వివరాలతో సహా మొత్తం వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్ సైట్ సందర్శించాలని అధికారులు తెలిపారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- జూలై 27, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- ఆగస్టు 17, 2023.
దిద్దుబాటు ప్రారంభ తేదీ- ఆగస్టు 17, 2023.
దిద్దుబాటు ముగింపు తేదీ- ఆగస్టు 19, 2023.
పరీక్ష తేదీ- అక్టోబర్ 13, 2023.
వయోపరిమితి..
కనీస వయోపరిమితి 17.5 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలుగా ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు 27/06/2003 నుండి 27/12/2006 మధ్య జన్మించి ఉండాలి.