నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ BDes DAT ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.
దిశ, ఫీచర్స్ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. NID బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des) ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందడానికి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావచ్చు. అభ్యర్థులు తమ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ admissions.nid.eduలో చూసుకోవచ్చు.
NID DAT 2024 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ డిసెంబర్ 12, 2023న విడుదల చేశారు. ఈ పరీక్ష డిసెంబర్ 24, 2023న జరిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ లింక్ https://admissions.nid.edu/NIDA2024 ద్వారా నేరుగా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాన్ని ఇలా తనిఖీ చేయండి..
NID admissions.nid.edu అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
B.Des. DAT ప్రిలిమ్స్ ఫలితాలు 2024 - 25 క్లిక్ చేయండి.
ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనిలో ఈమెయిల్, పుట్టిన తేదీ వివరాలను నింపి సమర్పించాలి.
సమర్పించిన తర్వాత, మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఫలితాన్ని చూసిన తర్వాత దాన్ని సేవ్ చేయండి లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
మార్కులు సమానంగా ఉంటే ర్యాంకింగ్ ఎలా ఉంటుంది ?
ఇద్దరు అభ్యర్థులు సమాన మార్కులు సాధిస్తే, DAT ప్రిలిమ్స్ పరీక్షలో పార్ట్- బిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే DAT ప్రిలిమ్స్ పరీక్ష పార్ట్- ఎ పరిగణిస్తారు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి ర్యాంకింగ్‌లో ప్రాధాన్యం ఉంటుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య ఇంకా టై ఉంటే, ఇద్దరికీ ఒకే ర్యాంక్ ఇస్తారు.
NID BDes 2024 ప్రధాన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు ?
ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు BDes 2024 ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. ప్రధాన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 14న వస్తాయి. పరీక్ష ఏప్రిల్ 27, ఏప్రిల్ 28 న జరుగుతుంది. పరీక్ష ఫలితాలు మే 21, 2024న వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు మే 21, మే 23 మధ్య క్యాంపస్ ప్రాధాన్యతలను పూరించడానికి అవకాశం పొందుతారు.