Groups Exam Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల ఎప్పుడంటే..!
తెలంగాణ(TG) రాష్ట్రంలో ఈ రోజు, రేపు గ్రూప్-2 పరీక్షలు(Group-II Exams) జరగనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(TG) రాష్ట్రంలో ఈ రోజు, రేపు గ్రూప్-2 పరీక్షలు(Group-II Exams) జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు 5,51,000 మంది అప్లై చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తుది ఫలితాలను(Final Results) విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే ఇక నుంచి రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్(Job Notification)లలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు విడతల్లో పరీక్షలు ఉంటే తొమ్మిది నెలల్లోగా.. కేవలం ఒకే ఎగ్జామ్ ఉంటే ఆరు నెలల్లో ఫలితాలను ప్రకటించేలా షెడ్యూల్ రెడీ చేస్తామని తెలిపారు. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం కేవలం సిలబస్(Syllabus) మాత్రమే ఇస్తుందని, అభ్యర్థులు తమకు నచ్చిన బుక్స్(Books) చదువుకోవచ్చని చెప్పారు. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధ్యయనం చేయడానికి ఈ నెల 18న ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ(UPSC) కమిషన్ సభ్యులను కలవనున్నట్లు పేర్కొన్నారు.