JMI RCA లో UPSC ఉచిత కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (JMI) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2025 ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తోంది.

Update: 2024-03-24 09:31 GMT

దిశ, ఫీచర్స్ : జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (JMI) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2025 ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు జామియా www.jmicoe.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. UPSC ఉచిత కోచింగ్ 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ మార్చి 18 నుంచి ప్రారంభమైంది.

రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఉచిత కోచింగ్ తీసుకునేందుకు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇతర కేటగిరీ అభ్యర్థులకు ఈ కోచింగ్ కి ప్రవేశాన్ని పొందలేరని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కోసం ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.

ప్రవేశ పరీక్ష విధానం ఎలా ఉంటుంది ?

బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. పరీక్షలో జనరల్ స్టడీస్, ఎస్సే రైటింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీష్/హిందీ/ఉర్దూలో ఎంపిక పొందుతారు. జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రకంగా ఉండి, సమయం 2 గంటలు ఉంటుంది. వ్యాసరచన కోసం 1 గంట సమయం ఉంటుంది. ప్రవేశ పరీక్షలో నెగెటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది. తప్పు సమాధానానికి మూడింట ఒక వంతు మార్కులు కోత విధిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు జరగనున్నాయి. ఢిల్లీ, శ్రీనగర్, జమ్మూ, హైదరాబాద్, లక్నో, గౌహతి, పాట్నా, బెంగళూరు, కేరళలో RCA కోచింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది 100 సీట్లు..

దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ.950 ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ నిర్వహణకు నెలకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు తరగతులు, టెస్ట్ సిరీస్, మాక్ ఇంటర్వ్యూల సౌకర్యం కూడా ఇవ్వబడుతుంది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (JMI) చాలా కాలంగా UPSC కోసం ఉచిత కోచింగ్ అందిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రారంభం – మార్చి 18, 2024

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - మే 19, 2024

ప్రవేశ పరీక్ష - జూన్ 1, 2024

ప్రవేశ పరీక్ష ఫలితం (అంచనా ) – జూన్ 20, 2024

ఇంటర్వ్యూ (తాత్కాలిక) - జూన్ 20, 2024

తుది ఫలితం (అంచనా ) – జూలై 12, 2024

అడ్మిషన్ తీసుకోవడానికి చివరి తేదీ - జూలై 22, 2024

వెయిటింగ్ లిస్ట్ అభ్యర్థుల ప్రవేశానికి చివరి తేదీ – జూలై 30, 2024

తరగతి (ఓరియంటేషన్) – జూలై 31, 2024

ప్రవేశ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి . పేపర్ 1 (జనరల్ స్టడీస్), పేపర్ 2 (ఎస్సే). పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.

Tags:    

Similar News