CUET PG ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు ఏప్రిల్ 13న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ – PG 2024 పరీక్ష ఫలితాలను ప్రకటించింది.
దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు ఏప్రిల్ 13న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ – PG 2024 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు pgcuet.samarth.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. NTA ఏప్రిల్ 12వ తేదీన CUET PG 2024 తుది సమాధాన కీని విడుదల చేసింది.
CUET PG 2024 పరీక్షను NTA మార్చి 11 నుండి మార్చి 28 వరకు పెన్ పేపర్ మోడ్‌లో దేశవ్యాప్తంగా నియమించిన కేంద్రాలలో నిర్వహించింది. ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 5న విడుదల చేయగా, అభ్యర్థులు దాని పై అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 7 వరకు గడువు ఇచ్చారు. దీని పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన జాతీయ పరీక్షా సంస్థ తుది సమాధాన కీని విడుదల చేసింది.
CUET PG ఫలితాలు 2024ని ఎలా చెక్ చేయాలి..
pgcuet.samarth.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
CUET PG 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు రోల్ నంబర్ మొదలైన అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
ఫలితం మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఇప్పుడు చెక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభం ?
ఈ పరీక్ష DU, BHU, JNU సహా వివిధ కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో PG ప్రవేశానికి నిర్వహించారు. మీడియా నివేదికల ప్రకారం అభ్యర్థి CUET PG స్కోర్ ఆధారంగా విశ్వవిద్యాలయాలు త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాయ. CUET PG 2024 స్కోర్ ద్వారా మాత్రమే అభ్యర్థులు PG కోర్సులో ప్రవేశం పొందుతారు. CUET PG స్కోర్‌కార్డ్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు CUE PG అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.