Big Alert: భారీ జీతంతో రైల్వేలో ఉద్యోగాలు..రేపే లాస్ట్ డేట్

రైల్వేశాఖ మరోసారి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 9,144 టెక్నీషియన్‌ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-04-07 15:16 GMT

దిశ,వెబ్‌డెస్క్: రైల్వేశాఖ మరోసారి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 9,144 టెక్నీషియన్‌ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులు 1092.. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మార్చి 9 నుంచి ఏప్రిల్ 8వరకు కొనసాగనుంది. రేపటితో గడు వు ముగియనుండడంతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. జూలై 1,2024 నాటికి వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫీజు :ఎస్సీ,ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌,మైనారిటీ,ఈబీసీ అభ్యర్థులు 250 రూ ఫీజు చెల్లించాలి. ఇతరులు రూ.500 చొప్పున చెల్లించాలి.

ఎంపిక విధానం:రెండు పోస్టులకూ కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ రాత పరీక్షతో పాటూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:ఈ పోస్టులకు ఎంపికైతే టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29000-92,300, గ్రేడ్-3 కి 19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది.


Similar News