నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 3825 ఉద్యోగాలకు ఈ రోజే లాస్ట్ డేట్

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో మంచి జీతంతో జాబ్ సంపాదించే అవకాశం వచ్చింది. నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-04-05 09:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో మంచి జీతంతో జాబ్ సంపాదించే అవకాశం వచ్చింది. నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ మార్చి 16వ తేదీని రిలీజ్ చేశారు. అయితే నేటితో గడువు ముగుస్తుంది.అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.nrrms.com/ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు 717 ఖాళీలు, MTS - 479, ఫెసిలిటేటర్- 613, ఫీల్డ్ కోఆర్డినేటర్- 698, MIS అసిస్టెంట్- 517, డేటా మేనేజర్- 213 పోస్టులు, MIS మేనేజర్- 348, టెక్నికల్ అసిస్టెంట్- 110, అకౌంట్స్ ఆఫీసర్- 78, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ (DPO)- 52 పోస్టులు భర్తీ కానున్నాయి.

విద్య అర్హతలు:ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు కనీసం 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయోపరిమితి:ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 18 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:జనరల్,OBC కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 350 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.


Similar News