Balmer Lawrie: బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ లో మేనేజీరియల్ ఖాళీలు.. పోస్టులు, అర్హత, జీతం తదితర వివరాలివే..!
ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్(BLCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్(BLCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11 మేనేజీరియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.balmerlawrie.com/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 6 డిసెంబర్ 2024. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో పని చేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు, ఖాళీలు:
- సీనియర్ మేనేజర్ - 01
- యూనిట్ హెడ్ - 01
- డిప్యూటీ మేనేజర్ - 04
- అసిస్టెంట్ మేనేజర్ - 05
విద్యార్హత:
సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు.. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
సీనియర్ మేనేజర్, యూనిట్ హెడ్ పోస్టులకు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 27 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
జీతం:
సీనియర్ మేనేజర్, యూనిట్ హెడ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70,000, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ. 50,000, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నెలకు రూ. 40,000 వరకు జీతం ఉంటుంది.